ఆర్డీవో ఆఫీసుకి వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్‌ !

Telugu Lo Computer
0


డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ముందుంగా దరఖాస్తు చేసుకొవాలి. ఆ తర్వాత తమ పరిధిలోని ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాలి. ఆతరువాత అక్కడ గైడ్‌లైన్స్ ప్రకారం డ్రైవింగ్ చేస్తే తొలుత లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్‌.. ఆ తర్వాత శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్‌ను అధికారులు మంజూరు చేసేవారు. అయితే.. ఇక నుంచి అలాకాకుండా ప్రతి సామాన్యుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందేలా గురువారం కేంద్ర జాతీయ రహదారుల.. రవాణాశాఖ మంత్రిత్వశాఖ ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీవో ఆఫీసుకెళ్లి, దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించింది. కాగా ఆర్డీవో కార్యాలయం వద్ద తప్పనిసరిగా టెస్ట్‌కు హాజరుకావాల్సిన అవసరం లేదని, కేవలం గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లలోనే డ్రైవింగ్ లైసెన్స్ పొందొచ్చనీ, అన్నీ సదుపాయాలను కల్పించేలా కేంద్ర, రాష్ట్ర అధికారులు నిర్ణయం తీసుకున్నారు. డ్రైవింగ్ శిక్షణ పొందిన వారికి అక్రిడిటేడ్ డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తాయి. అలా అక్రిడిటేడ్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ల వద్ద డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఆయా సంస్థల వద్ద డ్రైవింగ్ శిక్షణ కోసం పేరు నమోదు చేసుకోవాలి. ట్రైనింగ్‌, దానికి సంబంధించిన పరీక్ష పాసైన తర్వాత సంబంధిత అభ్యర్థులకు ఆయా ట్రైనింగ్ సెంటర్లు సర్టిఫికెట్లు జారీ చేస్తాయి. అటుపై శిక్షణ పొందిన వ్యక్తులు డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకోసం ఆర్టీవో వద్ద ఎటువంటి టెస్ట్ లేకుండానే ట్రైనింగ్ సర్టిఫికెట్ ఆధారంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందొచ్చు. అయితే.. సదరు ట్రైనింగ్ కేంద్రాలు.. స్టిమ్యులేటర్లు, డెడికేటెడ్ టెస్ట్ ట్రాక్‌లను కలిగి ఉండాలి. లైట్ మోటార్ వెహికల్స్, మీడియం.. హెవీ వెహికల్స్ డ్రైవింగ్‌లో సదరు అక్రిడేటెడ్ డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు శిక్షణ ఇస్తాయి. లైట్ మోటార్ వెహికల్స్ డ్రైవింగ్ శిక్షణ 29 గంటల పాటు ఉంటుంది. కాగా.. కోర్స్ ప్రారంభించిన నాలుగు వారాల్లో శిక్షణ పూర్తి కావాలి. ట్రైనింగ్ సెంటర్లు తమ వద్దకు వచ్చిన అభ్యర్థులకు థియరీ, ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించాలని, ఈ సెంటర్లు ఇండస్ట్రీ-స్పెసిఫిక్ స్పెషలైజ్డ్ శిక్షణ కూడా అందిస్తాయి. గతేడాదే కేంద్ర జాతీయ రహదారులు.. రవాణా మంత్రిత్వశాఖ నోటిపికేషన్‌ జారీ చేసింది. ఇలా అక్రిడేటెడ్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటుపై కొన్ని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కాగా.. డ్రైవింగ్ లైసెన్స్ వ్యవస్థను ప్రైవేటీకరించడమేనని.. ఈ సెంటర్లు సంబంధిత వ్యక్తులకు సరైన వెరిఫేషన్లు, తనిఖీలు చేయకుండానే డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తాయని ఆయా రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)