బ్యాగులో బాంబు ఉందంటూ బెంబేలెత్తించిన వ్యక్తి ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday 22 July 2022

బ్యాగులో బాంబు ఉందంటూ బెంబేలెత్తించిన వ్యక్తి !


పాట్నా విమానాశ్రయంలోని ఇండిగో విమానం 6ఈ-2126 విమానంలోకి ప్రయాణికులు ఎక్కి కూర్చున్నారు. వారితో పాటే ఓ వ్యక్తి సాధారణ ప్రయాణికుడిలా విమానం ఎక్కి కూర్చుని, తన బ్యాగులో బాంబు పెట్టుకుని వచ్చానని పక్కన ఉన్న వారితో చెప్పారు. దీంతో విమానంలోని ప్రయాణికులు అందరూ భయపడిపోయారు. ఈ విషయాన్ని విమాన సిబ్బందికి తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే బాంబు స్క్వాడ్ సిబ్బంది, పోలీసులు వెంటనే విమానం వద్దకు చేరుకున్నారు. ప్రయాణికులు అందరినీ కిందకు దించేసి, ఆ బ్యాగుతో పాటు విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అందులో ఏ బాంబూ లేదని నిర్ధారించారు. ఆ ప్రయాణికుడు చేసిన పనికి విమానాశ్రయంలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. అతడిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

No comments:

Post a Comment