'కొవిడ్‌ ఫైల్స్‌' పేరుతో వర్మసినిమా

Telugu Lo Computer
0


ఎన్నో యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కించి అలజడి సృష్టించిన వర్మ తాజాగా మరో వివాదాన్ని ముందేసుకున్నాడు. 'కొవిడ్‌ ఫైల్స్‌' పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు. స్వయంగా ట్విట్టర్‌ వేదికగా వర్మ ఈ విషయాన్ని తెలిపాడు. కరోనా సమయంలో దేశంలో ఎదురైన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ట్విట్టర్‌ వేదికగా కొన్ని ఫొటోలను పోస్ట్‌ చేస్తూ వరుస ట్వీట్స్‌ చేశాడు. ఈ సందర్భంగా వర్మ ట్వీట్ చేస్తూ 'కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వెనుక ఉన్న కుట్రదారు కరోనా వైరస్‌ కాదు. అధికార యంత్రంగంలో ఉన్న నిర్లక్ష్యం. దీనిని 'కొవిడ్‌ ఫైల్స్‌' నిరూపిస్తుంది. లక్షలాది ప్రాణం కోల్పోవడానికి కారణమైన అవినీతి, నిర్లక్ష్య యంత్రాంగాన్ని ఈ సినిమా బట్టయలు చేయనుంది. ఈ సినిమాలో చూపించే నిజాలు ఓటర్లలో ఆగ్రహం తెప్పిస్తుంది. వచ్చే ఎన్నికాల్లో ప్రభావం చూపిస్తుంది' అని రాసుకొచ్చారు. దీంతో వర్మ పెద్ద కాంట్రవర్సినే నెత్తికెక్కించుకున్నట్లు అర్థమవుతోంది. ఈ సినిమాలో ఎవరు నటిస్తారు.? ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుంది.? లాంటి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)