మల్టీస్టారర్ చేయాలంటే హీరోలు భయపడుతున్నారు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 21 July 2022

మల్టీస్టారర్ చేయాలంటే హీరోలు భయపడుతున్నారు


కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలలో ఇద్దరు హీరోలు కలిసి నటించిన చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఇద్దరు హీరోలు కలిసి నటించాలంటే భయపడుతున్నారని, మల్టీస్టారర్ చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదంటున్నారు స్టార్ హీరో అక్షయ్ కుమార్. బాలీవుడ్ స్టార్ హీరోలలో అక్షయ్ ఒకరు. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా సంవత్సరానికి నాలుగు చిత్రాలకు పైగా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటాడు. తాజాగా సమంతతో కలిసి కాఫీ విత్ కరణ్ షోలో పాల్గోన్నాడు. ఈ క్రమంలోనే మల్టీస్టారర్ చిత్రాల గురించి స్పందించాడు. పాపులారిటీ సర్వేలో అక్షయ్ కుమార్, సమంత ఎలా అగ్రస్థానంలో నిలిచారు అనే విషయం గురించి కరణ్ మాట్లాడారు. ఆల్ ఇండియా మోస్ట్ పాపులర్ నటి జాబితాలో సమంత అగ్రస్థానంలో ఉండగా.. బాలీవుడ్ జాబితాలో అక్షయ్ మొదటి స్థానంలో ఉన్నారు. మీరిద్దరు టాప్ లీస్టులో ఎలా ఉన్నారు అని ప్రశ్నించగా.. అక్షయ్ బదులిస్తూ నటీనటులందరూ కష్టపడి పనిచేయడమే ఇందుకు కారణమన్నారు. సాధారణంగా హిందీ నటీనటులు ఇద్దరు హీరోల సినిమాలు చేయాలంటే భయపడతారు. ఇక్కడ సింగిల్ హీరో సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. బీటౌన్ లో మల్టీస్టారర్ చిత్రాలను చేసేందుకు హీరోలలో అభద్రతా భావం ఉంది. దానిని విడిచిపెట్టాలి. తాను, కరణ్ కలిసి నిర్మిస్తున్న సినిమాలో సెకండ్ హీరో కావాలని, కానీ ఇప్పటివరకు హీరోను పొందలేకపోయామన్నారు.

No comments:

Post a Comment