పొగాకు వల్ల బాధాకరమైన మరణం !

Telugu Lo Computer
0


'ధూమపానం ఆరోగ్యానికి హానికరం'.. ఇప్పటి వరకు పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులైన సిగరెట్‌, బీడీ, పాన్‌ మసాలా వంటి ఉత్పత్తులపై ఉండే హెచ్చరిక. ఈ ఆరోగ్య హెచ్చరిక త్వరలోనే మారనుంది. దీని బదులుగా 'పొగాకు వల్ల బాధాకరమైన మరణం' అనే హెచ్చరికను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి తేనుంది. ఆ తేదీ నుంచి పొగాకు తయారీ, దిగుమతి, ప్యాకేజీ చేసే వారు తప్పనిసరిగా ఈ హెచ్చరికను ముద్రించాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కొత్త హెచ్చరిక ఏడాది పాటు అమల్లో ఉండనుంది. 'పొగ త్రాగేవారు యుక్త వయసులోనే మరణిస్తారు' అనే అర్థం వచ్చే హెచ్చరిక అమల్లోకి రానుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు సిగరెట్‌, ఇతర పొగాకు ఉత్పత్తుల తయారీ (ప్యాకేజీ, లేబులింగ్‌) నిబంధనలు-2008లో ఈ మేరకు సవరణలు చేసింది. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా శిక్షలు ఉంటాయని కేంద్రం హెచ్చరించింది. 


Post a Comment

0Comments

Post a Comment (0)