సినిమా సెట్స్‌లో భారీ అగ్నిప్రమాదం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 29 July 2022

సినిమా సెట్స్‌లో భారీ అగ్నిప్రమాదం !


ముంబైలోని సబర్బన్ అంథేరి లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. అంథేరి స్పోర్ట్స్ కాంప్లెక్స్ పక్కనే ఉన్న చిత్రకూట్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఫిల్మ్ సెట్‌లో సాయంత్రం  4.30 గంటలకు ఈ మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు. తొలుత ఆ ప్రాంతంలోని ఒక దుకాణంలో మంటలు వచ్చినట్టు అధికారులు చెప్పినప్పటికీ, ఆ తర్వాత ఫిల్మ్ సెట్‌లో మంటలు చెలరేగినట్టు ధ్రువీకరించారు. దట్టమైన పొగలు చట్టుపక్కల వ్యాపించడంతో మంటలను అదుపు చేసేందుకు మూడు అగ్నిమాపక శకటాలను రంగంలోకి దించారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడినట్టు సమచారం లేదని అధికారులు చెప్పారు.

No comments:

Post a Comment