ప్రీమియం రైళ్లలో సర్వీస్ ఛార్జీ రద్దు !

Telugu Lo Computer
0


రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లలో భోజనాన్ని ఎంచుకునే సమయంలో టిక్కెట్‌పై వర్తించే సర్వీస్ ఛార్జీ నిబంధనను రద్దు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రైల్వే బోర్డు, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కి పంపిన సర్క్యులర్‌లో ధరలు గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ తో సహా ఉన్నాయని, ఈ కారణంగా ప్రత్యేకంగా సేవా ఛార్జీలు ఉండవని పేర్కొంది. రైల్వే శాఖ నిర్ణయంతో రైల్లలో ఆర్డర్ చేసే ఆహారం మరింత చౌకగా లభించనుంది. మీల్స్, కూల్ డ్రింక్స్‌ను ముందుగా బుక్ చేసుకోని వారికి విక్రయించిన సందర్భంలో గతంలో ఆన్-బోర్డ్ సర్వీస్ ఛార్జ్ పేరుతో రైల్వే శాఖ 50 రూపాయలు అదనంగా వసూలు చేసేది. తాజాగా ఈ ఛార్జీలను రద్దు చేసింది. టీ, కాఫీ కూడా ప్రయాణికులందరికీ ఒకే ధరకు విక్రయించనున్నట్లు స్పష్టం చేసింది. తాజా నిర్ణయంతో రాజధాని, దురంతో, శతాబ్ది వంటి ప్రీమియమ్ రైళ్లలో భోజనం, టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్ వంటివి ముందుగా బుక్ చేసుకోకుండా ప్రయాణంలో అప్పటికప్పుడు కొనుగోలు చేసే ప్రయాణికులకు ఊరట కల్పించినట్లయ్యింది. ఐఆర్ టీసీ  గత నిబంధన ప్రకారం ప్రీమియమ్ రైళ్లలో ప్రయాణం చేసే ప్రయాణికులు టికెట్‌తో పాటు మీల్స్ బుక్ చేసుకోకపోతే ప్రయాణం సమయంలో మీల్స్ కొనుగోలు చేయాలంటే 50 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వచ్చేది. 20 రూపాయలకు విక్రయించే టీ, కాఫీ కావాలన్నా అదనంగా 50 రూపాయలు కట్టాల్సిందే. కానీ, ఇప్పుడు కాఫీ, టీ లకు ఎక్స్‌ట్రా ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)