చిరు వ్యాపారులకు జగనన్న తోడు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో తోపుడుబండ్లు, చిన్నచిన్న షాపుల ద్వారా వ్యాపారం చేసుకునేవారి కోసం జగనన్న తోడు పేరుతో వడ్డీలేని రుణాలను అందించనున్నది. ఈ మేరకు రాష్ట్రంలోని లక్షలాది మంది చిరువ్యాపారులకు రూ.10వేల చొప్పున సున్నావడ్డీ రుణాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది.  ఈనెల 26న లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో దీనికి సంబంధించిన కసరత్తు జరగుతోంది. వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది. ఆ తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిన అనంతరం మండల స్థాయి అధికారులకు ఆ తర్వాత జిల్లా కలెక్టర్లకు చేరుతోంది. లబ్ధిదారుల ఎంపిక అనంతరం జాబితా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. జగనన్న తోడు పథకం కింద రుణం పొందిన వారు నెలసరి వాయిదాల్లో నగదును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది మంది లబ్ధిదారుల ఎంపిక పూర్తైంది. ఈ ఏడాది మొదట్లో ఈ పథకం కోసం వివరాలు సేకరించినా పథకం అమలు ఆలస్యమైంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)