కంద - ఆరోగ్య ప్రయోజనాలు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 19 July 2022

కంద - ఆరోగ్య ప్రయోజనాలు !


కందలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కందను కోసినప్పుడు చేతులు దురద పెడుతూ ఉంటాయి. అందుకే చాలామంది కందను తినటానికి ఇష్టపడరు. కానీ ఇది డయాబెటిస్ ఉన్నవారికి, అధిక బరువు ఉన్నవారు, గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది. దీనిలో ఉండే విటమిన్స్, ఫైటో న్యుట్రియన్స్ వంటివి ఎటువంటి సమస్యలు లేకుండా కాపాడతాయి. విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు. అలాగే శరీరంలో .రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఇన్ఫెక్షన్స్ తో పోరాటం చేసే సామర్థ్యాన్ని శరీరానికి అందిస్తుంది. విటమిన్ బి6 ఉండే ఆహారాలను వారంలో రెండు సార్లు తప్పనిసరిగా తినాలి. ఇటువంటి ఆహారాలను తీసుకోవడం వలన శరీరంలో ఎర్ర రక్త కణాలు బాగా పెరుగుతాయి. అలాగే మన శరీర చర్మాన్ని రక్షిస్తుంది. కందలో బి6 చాలా సమృద్ధిగా ఉంటుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన బరువు తగ్గడానికి సహాయపడటమే కాకుండా జీర్ణసంబంధ సమస్యలైన గ్యాస్ట్రిక్., స్టొమక్ అప్సెట్ వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. ఒకప్పుడు మతిమరుపు అనేది వృద్ధాప్యంలో వచ్చే సమస్య కానీ ఈ రోజుల్లో 30 నుంచి 40 ఏళ్ల వయసు వచ్చేసరికి రోజులో ఏదో ఒక సమయంలో ఏదో ఒక విషయాన్ని మర్చిపోవడం జరుగుతుంది. ఇలాంటప్పుడు అశ్రద్ధ చేయకుండా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మతిమరుపు అనేది నిదానంగా ప్రారంభమై చివరకు తీవ్రమైన సమస్యగా మారుతుంది. కాబట్టి ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కంద తీసుకుంటే మతిమరుపు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. వారానికి రెండు సార్లు తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. అందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్., మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు జ్ఞాపక శక్తి పెరిగేలా చేస్తాయి. జ్ఞాపక శక్తి తగ్గితే చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి .కనీసం వారానికి ఒకసారి తప్పనిసరిగా కంద తీసుకుని మతిమరుపు నుంచి బయటపడడానికి ప్రయత్నించండి. 

No comments:

Post a Comment