ఐటీ రిటర్న్ గడువు పెంచాలి : హ్యాష్ ట్యాగ్ లతో ట్రెండింగ్ !

Telugu Lo Computer
0


ఆదాయ పన్ను రిటర్న్‌దాఖలు చేసేందుకు గడువు పొడిగించాలని ట్విట్టర్‌ వేదికగా డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. కొందరు వ్యక్తులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, సీఏ సంఘాల సభ్యులు గడువును పొడిగించాలని కోరుతున్నారు. ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లలో #Extend_due_date_immediately ఉంది. ఐటీఆర్ ఫైలింగ్ కోసం చివరి తేదీని పొడిగించే ఆలోచనలో ప్రభుత్వం లేదని జులై 22న ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాతో రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ చెప్పడంతో చర్చ మొదలైంది. ప్రస్తుత జులై 31 గడువును కోల్పోయిన వారికి జరిమానాలు, జరిమానా వడ్డీలు వర్తిస్తాయి. జులై 23న పొడిగింపు కోరుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ను ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్, న్యాయవాదులు, చార్టెడ్ అకౌంటెంట్లు, టాక్స్ ప్రాక్టీషనర్ల సంఘం కోరాయి. ఆడిట్ అవసరం లేని కేసుల కోసం ఒక నెల పొడిగించాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)