ప్రాణం తీసిన చాక్లెట్ ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 21 July 2022

ప్రాణం తీసిన చాక్లెట్ !


కర్ణాటకలోని ఉడుపి జిల్లాలోని బైందూర్​ సమీపంలో ఉన్న బిజూర్​ గ్రామానికి చెందిన సమన్వి (6) అనే చిన్నారి వివేకానంద స్కూల్​లో మొదటి తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం చిన్నారి స్కూల్​కు వెళ్లడానికి మారాం చేయడం తో తల్లిదండ్రులు చిన్నారికి నచ్చజెప్పి చాక్లెట్​ ఇచ్చారు. చాక్లెట్​ను ఆ చిన్నారి తింటున్న సమయంలో స్కూల్​ బస్​ వచ్చేసింది. దీంతో ఆ హడావుడిలో సమన్వి, ఒక్కసారిగా చాక్లెట్​ను మింగేసింది. ఆ తర్వాత స్కూల్​ బస్​ డోర్​ వద్ద కుప్పకూలింది. వెంటనే గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. కళ్ల ముందే తమ బిడ్డ చనిపోవడం తో ఆ తల్లిందండ్రులు విలవిలాడారు. 

No comments:

Post a Comment