కేరళలో మంకీపాక్స్ అనుమానిత కేసు నమోదు !

Telugu Lo Computer
0


కేరళలో ఓ వ్యక్తిలో మంకీపాక్స్‌ తరహా లక్షణాలు కన్పించడం భయాందోళనకు గురి చేస్తోంది. ఇటీవల విదేశాల నుంచి తిరిగొచ్చిన ఓ వ్యక్తి మంకీపాక్స్‌ తరహా లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ గురువారం వెల్లడించారు. వైరస్‌ నిర్ధారణ పరీక్షల నిమిత్తం అతడి నుంచి సేకరించిన నమూనాలను పుణెలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపినట్లు తెలిపారు. ఆ ఫలితాలు వచ్చిన తర్వాత వ్యాధిని ధ్రువీకరించగలమన్నారు. సదరు వ్యక్తి విదేశాల్లో మంకీపాక్స్‌ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగినట్లు మంత్రి తెలిపారు. అయితే, ఆ వ్యక్తి వయసు, ఏ దేశానికి వెళ్లొచ్చారన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. గత కొన్ని రోజులుగా మంకీపాక్స్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు 59 దేశాల్లో ఈ వైరస్‌ జాడ బయటపడగా.. 6వేలకు పైగా కేసులు.. మూడు మరణాలు కూడా నమోదయ్యాయి. అయితే, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో 80శాతం కేవలం యూరప్‌ దేశాల్లోనే బయటపడ్డట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)