మోదీ హత్యకు కుట్ర భగ్నం !

Telugu Lo Computer
0

 


ప్రధాని నరేంద్ర మోదీ హత్య కుట్రను బిహార్ పోలీసులు భగ్నం చేశారు. మోదీని హత్య చేయడంతో పాటు, 2047లోపు ఇండియాను ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలన్న లక్ష్యంతో పని చేస్తున్న ఇద్దరు తీవ్రవాదుల్ని పాట్నా పోలీసులు అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు పాట్నాలోని నయా టోలా ప్రాంతంలో జూలై 11న దాడులు నిర్వహించి ఇద్దరినీ అరెస్టు చేశారు. ఈ నెల 12న బిహార్‌లో మోదీ పర్యటన సందర్భంగా ఆయన్ను హత్య చేసేందుకు నిందితులు ప్రణాళికలు రూపొందించారు. మోదీ పర్యటనకు ముందు అంటే జూలై 6, 7 తేదీల్లో సమావేశమై ఆయన హత్యపై చర్చించారు. మోదీ పర్యటనకు ముందే నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన తీవ్రవాదులు ఇద్దరూ పాట్నాలోని ఫుల్వారి షరీఫ్‌లో 15 రోజులపాటు శిక్షణ పొందారు. తీవ్రవాదుల్ని పట్టుకున్న అనంతరం పోలీసులు ఫుల్వారి షరీఫ్‌లో దాడులు నిర్వహించారు. అక్కడ ఈ కుట్రకు సంబంధించిన డాక్యుమెంట్లు, పలు పాంఫ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అక్కడి డాక్యుమెంట్లలో 2047లో ఇండియా ఇస్లామిక్ రాజ్యంగా మారాలి అని ముద్రించి ఉన్నాయి. అలాగే ఈ దాడుల్లో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి యువత ఫుల్వారి షరీఫ్‌ వచ్చి తీవ్రవాద శిక్షణ తీసుకున్నట్లు తెలిసింది. తీవ్రవాదులకు పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీతోపాటు దేశ వ్యతిరేక శక్తుల నుంచి నిధులు సమకూరుతున్నట్లు వెల్లడైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)