సీనియర్‌' రాయితీపై రైల్వే శాఖ యూటర్న్‌ ? - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 27 July 2022

సీనియర్‌' రాయితీపై రైల్వే శాఖ యూటర్న్‌ ?


రైళ్లలో వృద్ధులకు రాయితీ ఎత్తివేస్తామనడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన వేళ రైల్వే శాఖ యూటర్న్‌ తీసుకుంది. వారికి రాయితీ పునరుద్ధరించనుంది. అయితే, ఇందులోనూ ఓ మెలిక పెట్టనుంది. కేవలం 70 ఏళ్లు పైబడి జనరల్‌, స్లీపర్‌ తరగతుల్లో ప్రయాణానికే రాయితీ వర్తింపజేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొవిడ్‌ సమయంలో రైల్వేలో ఉన్న అన్ని రాయితీలూ ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రాయితీలు పునరుద్ధరించినప్పటికీ వృద్ధులకు రాయితీని మాత్రం పునరుద్ధరించలేదు. దీన్ని పునరుద్ధరించాలని డిమాండ్లు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటీవల రాయితీలపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేశారు. వృద్ధులకు రాయితీ పునరుద్ధరించే ఉద్దేశం లేదని కుండబద్దలు కొట్టారు. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో రైల్వే శాఖ తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. కొవిడ్‌ ముందు 58 ఏళ్లు దాటిన మహిళలకు, 60 ఏళ్లు దాటిన పురుషులకు రాయితీ వర్తించేది. మహిళలకు 50 శాతం, పురుషులకు 40 శాతం టికెట్‌లో రాయితీ ఇచ్చేవారు. అయితే, ఇకపై కేవలం 70 ఏళ్లు దాటిన వారికి మాత్రమే రాయితీ ఇవ్వాలని రైల్వే యోచిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదీ కేవలం నాన్‌-ఏసీ తరగతులకే పరిమితం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి దీనిపై సమీక్ష జరుగుతోందని, పూర్తి స్థాయిలో ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనివల్ల భారం తగ్గుతుందని రైల్వే బోర్డు భావిస్తోంది.

No comments:

Post a Comment