బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు కేంద్రం చేయూత !

Telugu Lo Computer
0


నష్టాల్లో కూరుకుపోయిన బీఎస్ఎన్ఎల్‌కు చేయూత అందించాలని  కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. 1.64 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని కేటాయిస్తున్నట్లు టెలికామ్ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అలాగే, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ లిమిటెడ్ (బీబీఎన్ఎల్) విలీనానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వివరించారు. మరోవైపు, దేశంలోని మారుమూల గ్రామాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను విస్తృతం చేయడానికి కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రూ.26,316 కోట్ల అంచనా వ్యయంతో యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ద్వారా 29,616 గ్రామాలకు 4జీ సేవలు అందించాలని నిర్ణయించామని అన్నారు. దేశ వ్యాప్తంగా 19,722 మొబైల్ టవర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు

Post a Comment

0Comments

Post a Comment (0)