నాకు క్యాన్సర్ ఉంది

Telugu Lo Computer
0


అమెరికా లోని మసాచుసెట్స్, సోమర్‌సెట్‌లో పూర్వపు బొగ్గు గనిని సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూ, తనకు కేన్సర్ ఉందని అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. వాతావరణ మార్పులపై పోరాడటం కోసం జారీ చేసిన నూతన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బైడెన్ వ్యాఖ్యలపై కలకలం రేగడంతో వైట్ హౌస్ వెంటనే స్పందించింది. గత ఏడాది జనవరిలో దేశాధ్యక్ష పదవిని చేపట్టడానికి ముందు బైడెన్ స్కిన్ కేన్సర్ ట్రీట్‌మెంట్ తీసుకున్నారని తెలిపింది. దానినే ఆయన ప్రస్తావించారని పేర్కొంది. ఈ కలకలానికి కారణమైన బైడెన్ మాటలు ఏమిటంటే, ''మేం నడవగలిగినప్పటికీ మా అమ్మ మమ్మల్ని కారులో తీసుకెళ్ళేవారు. అప్పుడు ఏం జరిగిందో ఊహించండి? చలి కాలం ప్రారంభం రోజుల్లో, ఏం జరుగుతుందో మీకు తెలుసు? కిటికీ అద్దాల నుంచి చమురు తెట్టును తొలగించడానికి విండ్‌షీల్డ్‌ను ఉపయోగించవలసి ఉంటుంది. అందుకే నాకు - నాతోపాటు పెరిగిన చాలా మందికి - కేన్సర్‌ ఉంది. అందుకే డెలావరేలో చాలా కాలం వరకు దేశంలో అత్యధిక కేన్సర్ రేటు ఉండేది'' అని అన్నారు. ఆయిల్ రిఫైనరీల నుంచి వెలువడే ఉద్గారాల గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. డెలావరేలో తన బాల్యంనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ఈ వీడియో ట్విటర్‌లో రాగానే చాలా మంది యూజర్లు ఆత్రుతగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇది మరొక పొరపాటా? అంగీకారమా? అని ప్రశ్నించారు. 'తనకు కేన్సర్ ఉందని జో బైడెన్ ఇప్పుడు చెప్పారు. ఓ పురుష సభ్యుడిని 'ఆమె' అన్నారు. ఈరోజు విషయాలు నిజంగా చాలా బాగున్నాయి'' అని ఓ యూజర్ పేర్కొన్నారు. 'జో బైడెన్‌కి కేన్సర్ ఉందా? దెమెంతియా ఉందా?'' అని మరొకరు ట్వీట్ చేశారు. ''మీకు కేన్సర్ నయమవాలని ప్రార్థిస్తున్నాను'' అని ఇంకొకరు ట్వీట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)