కుక్కల దాడిలో గాయపడిన కోతికి శస్త్ర చికిత్స

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా చెరుకువాడలో ఓ కోతిపై కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన ఆ కోతిని స్థానికులు భీమవరంలోని పశువైద్యుడు మేకా సాయితేజ వద్దకు తీసుకువెళ్లారు. వైద్యుడు కోతికి చికిత్స చేస్తుండగా ఎడమ భుజం భాగంలో బుల్లెట్ గాయం ఉండటంతో అవాక్కయ్యాడు. వెంటనే శస్త్ర చికిత్స చేసి బుల్లెట్ ను బయటకు తీశారు. కోతి పూర్తిగా కోలుకున్న తరువాత బయట విడిచిపెడతామని చెప్పారు వైద్యుడు సాయితేజ. కోతి శరీరంలో బుల్లెట్ బయటపడిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు స్పందించారు. వెంటనే వారు సాయితేజ ఆసుపత్రికి వెళ్లి కోతి నుండి తీసిన బుల్లెట్ ను పరిశీలించారు. అది బుల్లెట్ కాదనీ, రొయ్యల చెరువుపై పక్షులను కొట్టేందుకు కాపలాదారులు ఉపయోగించే పిల్లెట్ అని నిర్ధారించారు. ఇది సెంటీ మీటరులో మూడో వంతు ఉంటుందని, దీనిలో గన్ పౌడర్ ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై మరో పక్క చెరుకువాడ గ్రామ పరిసరాల్లో అటవీ శాఖ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూగ జీవాలపై కర్కశంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)