దేశంలో 91,927 ఎంబీబీఎస్ సీట్లు - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 29 July 2022

దేశంలో 91,927 ఎంబీబీఎస్ సీట్లు


నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ను ఈ ఏడాది నీట్ పరీక్ష జులై 17న ముగిసింది. దాదాపు 18 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నీట్-2022 ఆన్సర్ కీ జులై 31న రిలీజ్ చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక తుది ఫలితాలు ఆగస్టు 18 - 31 మధ్య విడుదలవుతాయని భావిస్తున్నారు. ఈ సంవత్సరం నీట్ కటాఫ్ మార్కులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నీట్ ఫలితాల ప్రకటనకు ఇంకా సమయం ఉంది. అయితే మంచి మెడికల్ కాలేజీలో అడ్మిషన్ తమ టార్గెట్ అని అభ్యర్థులు చెబుతున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కలిపి 91,927 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఢిల్లీలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 1247 సీట్లు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 250 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మహారాష్ట్రలో ప్రైవేట్ కాలేజీల్లో 4,825సీట్లు, ప్రభుత్వ కాలేజీల్లో 5070 సీట్లు అందుబాటులో ఉన్నాయి. యూపీలో ప్రైవేట్ సీట్లు 4,303 కాగా, ప్రభుత్వ సీట్లు 4,750. చండీగఢ్‌లో కేవలం ప్రైవేట్ సీట్లు 150 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్- ప్రభుత్వ మెడికల్ సీట్లు వరుసగా ఉత్తరాఖండ్‌లో 700- 450, చత్తీస్ గఢ్‌లో 956-600, గుజరాత్‌లో 3,700- 2000, హర్యానాలో 710 - 950, జార్ఖండ్ 680- 250, మధ్యప్రదేశ్ 2180 -1900, హిమాచల్ ప్రదేశ్ 770 - 150, బీహార్ 1,515 - 900, పంజాబ్ 800- 950, రాజస్థాన్ 3,055 - 950, జమ్మూ కాశ్మీర్ 1,047 - 100, ఏపీ 2,485 - 2850, తమిళనాడు 5,225 - 5500, కర్ణాటక 3,150 - 6,995, కేరళ 1,555 - 2700, పశ్చిమ బెంగాల్ 3,225 - 1000, ఒడిషా 1,375 - 750, తెలంగాణ 1,840 - 3200 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పాస్ కావాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా 50 పర్సంటైల్ స్కోర్ సాధించాలి. ఈ ఏడాది నీట్ కోసం గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దీంతో అగ్రశ్రేణి వైద్య కళాశాలల్లో సీటు సాధించడానికి పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈసారి పేపర్ గత సంవత్సరం కంటే కఠినంగా ఉంది. కట్-ఆఫ్ కూడా ఈసారి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో అడ్మిషన్ పొందాలంటే, నీట్ 2022లో దాదాపు 600 మార్కులు సాధించాల్సి ఉంటుందని నిపుణులు తెలిపారు.

No comments:

Post a Comment