ఒకే తేదిన 73 లక్షల మందికి పెన్షన్ జమ !

Telugu Lo Computer
0


ఒకేసారి 73 లక్షల మంది పింఛనుదారులకు పెన్షన్ ను క్రెడిట్ చేసే దిశగా కసరత్తు చేస్తోంది. ఈ నెల 29, 30 తేదీల్లో జరగనున్న బోర్డు సమావేశంలో సెంట్రల్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ను ఖరారు చేసే ప్రతిపాదనను ఆమోదించే అవకాశమున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన ఓకే అయిన పక్షంలో దేశమంతటా 73 లక్షలకు పైగా ఉన్న పింఛనుదారుల బ్యాంకు ఖాతాలకు ఇపీఎఫ్ఓ ప్రయోజనాలు జమ కానున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని పింఛనుదారులకు ప్రతీ నెల వివిధ తేదీల్లో పింఛన్లు జమవుతూ వస్తున్నాయి. అలాకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పింఛనుదారులందరికీ ఒకేమారు పింఛన్లను జమ చేయాలని ఇపీఎఫ్ఓ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 29, 30 తేదీల్లో జరగనున్న సమావేశంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనపై బోర్డు చర్చించనుంది. అంతేకాకుండా... "ఆరు నెలల కంటే తక్కువ కాలం పాటు విరాళాలు అందించిన చందాదారులు పెన్షన్ ఖాతాల నుండి డిపాజిట్లను ఉపసంహరించుకోవడానికి అనుమతించే ప్రతిపాదనను కూడా సీబీటీ  అదే సమావేశంలో పరిశీలించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం, ఆరు నెలల నుండి 10 సంవత్సరాల వరకు చందా చేసిన వారి పెన్షన్ ఖాతాల నుండి మాత్రమే ఉపసంహరణలకు అవకాశముంది.

Post a Comment

0Comments

Post a Comment (0)