దేశంలో 5 ఏళ్ల తర్వాత పెట్రోల్ వాడకం ఉండదు

Telugu Lo Computer
0


మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఐదేళ్ల తర్వాత దేశంలో పెట్రోల్ వాడకం ఉండదన్నారు. భవిష్యత్‌లో వాహనాలు గ్రీన్ హైడ్రోజన్, ఇథనాల్ ఫ్లెక్స్‌తో నడుస్తాయని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరల కంటే తక్కువ ధరలకే ఇథనాల్, గ్రీన్ హైడ్రోజన్ లభిస్తాయని, వాటి నుండి కాలుష్యం కూడా తక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో గ్రీన్ హైడ్రోజన్, ఇథనాల్ అందుబాటులోకి వచ్చాక దేశంలో పెట్రోల్ వాడకాన్ని నిషేధించనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా పెట్రోలు, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా పంట అవశేషాల నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని గతంలో గడ్కరీ చెప్పిన విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)