దేశంలో కొత్తగా 18,313 కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గత 24 గంటలలో 4.25 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా..18 వేల 313 మందిలో వైరస్‌ ఉందని తేలింది. పాజిటివిటీ రేటు 4.31 శాతంగా ఉంది. రికవరీ రేటు పెరుగుతుండటం కొంత కలవరాన్ని తగ్గిస్తోంది. తాజాగా 20 వేల 742 మంది కరోనా నుంచి కోలుకుని వారియర్‌గా నిలిచారు. రికవరీ రేటు 98.47 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 1.45 లక్షలుగా ఉన్నాయి. క్రియాశీల రేటు 0.33 శాతతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల 57 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 4.39 కోట్ల మందికి కోవిడ్ సోకింది. 4.32 కోట్ల మంది వైరస్‌ను జయించారు. 5.26 లక్షల మంది మృత్యుఒడికి చేరారు. మొత్తంగా కేసులు హెచ్చు తగ్గుల మధ్య నమోదవుతుండటంతో భయాందోళనలు కల్గిస్తోంది. రానున్న రోజుల్లో ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. దేశప్రజలంతా కరోనా మార్గదర్శకాలను పాటించాలంటున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకుంది. 24 గంటల వ్యవధిలో 27.37 లక్షల మందికి టీకా అందించారు. ఇప్పటివరకు 202.79 కోట్ల డోసులను పంపిణీ చేశారు. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)