ఠాక్రేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన షిండే - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 27 July 2022

ఠాక్రేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన షిండే


మహారాష్ట్ర సీఎం, శివసేన రెబల్‌ నేత ఏక్‌నాథ్‌ షిండే, మాజీ సీఎం, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఉద్ధవ్‌ ఠాక్రేను మాజీ సీఎంగా ఆయన సంబోధించారు. ఈ మేరకు బుధవారం ఒక ట్వీట్‌ చేశారు. 'మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, గౌరవనీయులైన ఉద్ధవ్‌ ఠాక్రేకు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని, తల్లి జగదాంబ పాదాలను ప్రార్థించండి' అని మరాఠీలో పేర్కొన్నారు. ఉద్ధవ్‌ ఠాక్రే బుధవారం 62వ ఏట అడుగుపెట్టారు. కాగా, సామ్నా పత్రికకు ఉద్ధవ్‌ ఠాక్రే మంగళవారం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏక్‌నాథ్ షిండే తనను మోసం చేశారని విమర్శించారు. తాను లేవలేని స్థితిలో హాస్పిటల్‌లో ఉన్నప్పుడు తన ప్రభుత్వంపై కుట్ర పన్నారని ఆరోపించారు. తన శరీరం కదలలేని స్థితిలో ఉన్నప్పుడు, వాళ్ల కదలికలు హెచ్చు స్థాయిలో సాగాయని మండిపడ్డారు. షిండే తిరుగుబాటు తీరును ఖండించారు. ఒకవేళ తానే ఏక్‌నాథ్‌ను సీఎంగా చేసినా, అతని రాక్షసత్వం అలాగే ఉండేదని విమర్శించారు. మరోవైపు, షిండేను నమ్మడం తాను చేసిన పెద్ద తప్పు అని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. షిండే వర్గం తన తండ్రి పేరిట ఎన్నికల్లో ఓట్లు అడగ కూడదని అన్నారు. ఎండిన ఆకులు చెట్టు నుంచి రాలిపడతాయని, అలాగే చెట్టు నుంచి అన్ని పొందిన తర్వాత ఇప్పుడు ఆ చెట్టును వీడాయంటూ షిండే వర్గాన్ని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కూడా మహారాష్ట్రను వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు.

No comments:

Post a Comment