పర్యాటకులకు కారవాన్లు !

Telugu Lo Computer
0


కరోనా తర్వాత పర్యాటక రంగానికి భారీగా డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో తగిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. కేరళలోనూ టూరిజంను అభివృద్ధి చేయడంలో భాగంగా పలు నూతన ఆవిష్కరణలకు తెర లేపుతున్నారు. కారవాన్లు అనగానే షూటింగ్ కు ముందు సెలబ్రెటీలు రెడీ కావడానికి, తమ అవసరాలు తీర్చుకోవడానికని మాత్రమే తెలుసు. కానీ కేరళలో కొత్తగా ఈ కారవాన్ సేవలు పర్యాటకలకూ అందుబాటులోకి రానున్నాయి. వివిధ దేశాల్లో ఈ కాన్సెప్ట్ సక్సెస్ కావడంతో.. ఇప్పుడు పర్యాటక ప్రాంతమైన కేరళలోనూ ఈ సేవలను అందించబోతున్నారు. కారవాన్ టూరిజం ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేయాలన్న ఉద్దేశంతో కారవాన్ కేరళ అనే నినాదానికి పిలుపునిచ్చారు. అయితే ఈ కొత్త ఒరవడిని పర్యాటకులు సైతం స్వాగతించడంతో వెయ్యికి పైగా కారవాన్ లు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కేరళ ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ లోనే ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టగా, రాష్ట్ర వ్యాప్తంగా మరో 150 కారవాన్ పార్కులు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే, అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూనే వీటిని అమలు చేస్తామని తెలిపారు. ఇక ప్రత్యేకించి ఈ కారవాన్ గురించి చెప్పుకోవాలంటే దీంట్లో కిచెన్, ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్, మైక్రోవోవెన్, టీవీ, ఛార్జింగ్ సిస్టమ్, బాత్ రూం, జీపీఎస్, ఆడియో- వీడియో లాంటి పలు సదుపాయాలు కల్పించనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)