యోగాసనాలతో ఆకట్టుకున్న ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్

Telugu Lo Computer
0


ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హిమాలయ శ్రేణుల్లో తమ ఆసనాలతో యోగా డేలో పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గత 8 ఏళ్ల నుంచి ఐటీబీపీ ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. లడాఖ్‌, హిమాచల్ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, సిక్కిమ్‌, అరుణాచల్ ప్రదేశ్‌లో ఐటీబీ పోలీసులు యోగాసనాలతో తమ శరీర ధారుఢ్యాన్ని పెంచుకుంటున్నారు. యోగా దినోత్సవం సందర్భంగా ఐటీబీపీ ఓ పాటను రాసి పాడారు. గౌహతిలోని బ్రహ్మపుత్ర నది తీరంలోని లచిత్ ఘాట్ వద్ద 33వ బెటాలియన్‌కు చెందిన ఐటీబీపీ పోలీసులు యోగాను నిర్వహించారు. సిక్కిమ్‌లో మంచు విపరీతంగా ఉన్న ప్రదేశంలో సుమారు 17 వేల ఫీట్ల ఎత్తులో ఐటీబీపీ హిమవీరులు యోగా ప్రాక్టీస్ చేశారు. ఉత్తరాఖండ్‌లో కూడా సుమారు 16 వేల ఫీట్ల ఎత్తులో ఐటీబీపీ హిమవీరులు యోగా చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో 16500 ఫీట్ల ఎత్తులో ఐటీబీపీ హిమవీరులు యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. వివిధ ఆసనాలతో వేస్తూ తమ శారీర, మానసిక బలాన్ని పెంచుకుంటున్నారు. చత్తీస్‌ఘడ్‌లోని నారాయణ్‌పూర్‌లో కూడా ఐటీబీపీ పోలీసులు యోగాలో పాల్గొన్నారు. ఇక లడాఖ్‌లో సుమారు 17 వేల ఫీట్ల ఎత్తులో ఐటీబీపీ దళం యోగా నిర్వహించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని లోహిత్‌పురలో కూడా ఐటీబీపీ యోగా ఈవెంట్ నిర్వహించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)