ప్లాస్టిక్ బ్యాగ్ లో తెగిపడిన శరీర భాగాలు

Telugu Lo Computer
0


రాంలాలీ మైదానంలో తెగిపడిన శరీర భాగాలతో కూడిన ప్లాస్టిక్ బ్యాగ్‌ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ గ్రౌండ్‌లో పోలీస్ యూనిట్ పెట్రోలింగ్ చేస్తుండగా, పొదల్లోంచి భయంకరమైన దుర్వాసన రావడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే సమాచారాన్ని సమీపంలోని పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు అందించారు. సమాచారాన్ని అందుకున్న వెంటనే పాండవ్ నగర్ పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. పొదల మాటున ఉన్న ఆ బ్యాగ్‌ను విప్పి చూడగా వారు షాక్ అయ్యే విధంగా అందులో తెగిబడిన శరీర భాగాలు లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకుని, స్థానిక ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు పోలీసులు. ఫోరెన్సిక్ డిపార్ మెంట్ క్రైమ్ సైట్‌కు చేరుకొని క్లూస్ సేకరించగా.. దీనిపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)