ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్తత - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 30 June 2022

ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్తత


రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గురువారం ఉద్రిక్తత తలెత్తింది. వివిధ హిందూ సంఘాలకు చెందిన దాదాపు వెయ్యి మంది గుమిగూడి నిరసన ప్రదర్శన చేపట్టారు. కాషాయ జెండాలు చేత బట్టుకున్న ఆందోళనకారులు కన్హయ్య హత్య నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కన్హయ్య హత్య జరిగిన ప్రదేశానికి ర్యాలీగా వచ్చేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు స్పందించి, ఆందోళనకారుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే కొందరు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయినప్పటికీ, పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. శాంతియుతంగా ర్యాలీ చేసుకునేందుకు జిల్లా యంత్రాంగం అనుమతి ఇచ్చిందని, అందువల్లే ఈ ర్యాలీ జరిగిందని పోలీసులు తెలిపారు. కాగా, ఒకవైపు నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉండటంతోపాటు, జనాలు గుంపులుగా కనిపించడంపై నిషేధం ఉన్నప్పటికీ ఇలాంటి ర్యాలీకి అనుమతించడం అనేక సందేహాలకు తావిస్తోంది. ఈ రోజు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కన్హయ్య కుటుంబ సభ్యులను కలవబోతున్నారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల చెక్కును అందించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా ఉదయ్‌పూర్‌లో మరింత భద్రత పెంచారు. ఇక ఈ కేసులో నిందితుల్ని ఎన్ఐఏ విచారిస్తోంది. దీనిలో కీలక విషయాలు బయటపడుతున్నాయి.

No comments:

Post a Comment