వారసుల చేతుల్లోకి రిలయన్స్ సంస్థలు

Telugu Lo Computer
0


ధీరూభాయి మరణం తర్వాత ఆస్తుల పంపకాల విషయంలో తమ్ముడు అనిల్ అంబానీతో చాలా వివాదాలు ఎదుర్కొన్నారు ముఖేష్. ఐతే ఆ తర్వాత తల్లి మధ్యవర్తిత్వంతో ఆస్తుల పంపకం విషయంలో ఓ క్లారిటీ వచ్చినా.. అనిల్ అంబానీ పాతాళానికి పడిపోయారు. ఇలాంటి పరిస్థితి ఏదీ తన పిల్లలకు రావొద్దన్నదే ముఖేష్‌ ఉద్దేశం. విభేదాలు మాత్రమే కాదు.. భవిష్యత్‌లో నష్టాలు వచ్చినా.. చేయి అందించే ఓ తోడు కావాలని అనుకున్నారు. అందుకే ట్రస్ట్‌ ఏర్పాటుకు సిద్ధం అయ్యారు. వాల్టన్‌ నుంచి కొచ్‌ కుటుంబం వరకు.. ఎవరెవరు తమ వారసులకు ఆస్తులు ఎలా పంచారని స్టడీ చేశారు. ట్రస్ట్ ఏర్పాటు చేయడమే బెటర్ అని ఫిక్స్ అయ్యారు. ఆస్తుల పంపకం మొదలుపెట్టారు. ముందుగానే వ్యాపారంలో అన్నిరకాల ఎత్తుపల్లాలు పరిచయం చేసి మరీ.. పిల్లలకు సంస్థలను అప్పగిస్తున్నారు ముకేష్ అంబాని. ఆకాశ్, ఈషా.. ఇద్దరు కూడా తమ టాలెంట్‌తో రిలయన్స్ సంస్థకు కొత్త లాభాలు పరిచయం చేశారు. జియో సక్సెస్ వెనక ఈ ఇద్దరి కృషి, ఆలోచన ఎంతో ఉంది. తమ సంస్థను రిటైల్ నుంచి టెక్నాలజీ వైపు మళ్లించడంలో ఈ ఇద్దరు కీలక పాత్ర పోషించారు. జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్‌బుక్‌లో 44వేల కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పించింది కూడా ఆకాశ్‌, ఈషానే. రిలయన్స్ ఈ-కామర్స్‌లోకి అడుగు పెట్టాలన్న ముకేశ్ అంబానీ కలను సాకారం చేసింది కూడా ఈ ఇద్దరే ! ఫేస్‌బుక్‌ అనుబంధ వాట్సాప్‌తో కలిసి జియోమార్ట్ పేరుతో ఈ – కామర్స్ లావాదేవీలను రిలయన్స్ సంస్థ ప్రారంభించింది. ఐతే సంస్థ అభివృద్ధిలో వారు పోషించిన పాత్ర, వారి ఆలోచనలు గమనించి.. ఆస్తులు పంచే సమయం ఆసన్నమైందని ముఖేష్ ఫిక్స్ అయ్యారు. ఒక్కో అడుగు వేస్తూ వెళ్తున్నారు. జియో ఇన్ఫోకామ్ బాధ్యతలను ఆకాశ్‌కు అప్పజెప్పిన ముఖేష్ అంబానీ.. రిలయన్స్ రిటైల్‌ బాధ్యతలను ఈషా చేతుల్లో పెట్టబోతున్నారు. స్టాన్‌ఫోర్డ్‌ నుంచి ఎంబీఏ చేసిన ఈషా.. రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌, టెలికాం సేవల సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌ బోర్డుల్లో 2014 నుంచి డైరెక్టరుగా కొనసాగుతున్నారు. రిలయన్స్ రిటైల్ కంపెనీకి రిలయన్స్ రిటైల్ వెంచర్స్ అనేది హోల్డింగ్ కంపెనీగా ఉంది. రిలయన్స్ రిటైల్ అనేది సూపర్ మార్కెట్ల నిర్వహణ కార్యకలాపాలు చూసుకుంటుంది. ఎలక్ట్రానిక్స్, ఫుడ్ అండ్ గ్రాసరీ, ఫ్యాషన్, జువెలరీ, ఫుట్‌వేర్, క్లాథింగ్ వంటి వాటిని విక్రయిస్తాయ్. రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ స్మార్ట్, రిలయన్స్ స్మార్ట్ పాయింట్, రిలయన్స్ జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్, జియో స్టోర్, రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ కన్సూమర్ బ్రాండ్స్, 7 లెవెన్, ప్రాజెక్ట్ ఈవ్, ట్రెండ్స్ ఫుట్‌వేర్, రిలయన్స్ జువెల్స్, అజియో, రిలయన్స్ బ్రాండ్స్, రిలయన్స్ మాల్.. ఇవన్నీ రిలయన్స్ రిటైల్ కిందకే వస్తాయి. వీటన్నింటి బాధ్యత ఇప్పుడు ఇషా చేతుల్లోకి రాబోతున్నాయి. వ్యాపార మెళకువలు నేర్చుకున్నాకే.. ఇద్దరికి బాధ్యతలు అప్పగించేందుకు ముఖేష్ సిద్ధం అవుతున్నారు. చాలా ఏళ్లుగా ఈ ఇద్దరు రిలయన్స్ గ్రూప్‌లో డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. జియో ఇన్ఫోకామ్‌ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న ఆకాశ్ అంబానీ.. బ్రౌన్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందారు. జియో పుట్టుకలో, ఎదుగుదలలో.. ఆకాశ్ పాత్ర ఎంతో కీలకం. ఓ సంస్థలో డైరెక్టర్ అంటే.. మూసి ఉన్న గదిలో.. నాలుగు గోడల మధ్య పనిచేసుకోవడం కాదు.. నలుగురి మధ్య పనిచేయాలి అని నమ్మే వ్యక్తి ఆకాశ్. అందుకే ఓపెన్ ఆఫీస్ కల్చర్‌ పరిచయం చేశారు. అదే ఉద్యోగుల్లో ఆయన మీద మరింత నమ్మకం పెంచింది. అనుకున్న లక్ష్యాలు చేరుకున్నప్పుడు.. తోటి ఉద్యోగులను ప్రేమగా ప్రోత్సహించడం, కౌగిలించుకొని అభినందించడం.. పెద్దవాళ్లు అయితే జీ అంటూ మర్యాదగా మాట్లాడడం.. ఇలా ఆకాశ్ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. మెటా, గూగుల్‌, ఇంటెల్‌ సంస్థలతో జియో ప్లాట్‌ఫామ్స్‌ భాగస్వామ్యం గురించి ఏర్పాటు అయిన టీమ్‌ను.. ఆకాశ్‌ అంబానీనే లీడ్‌ చేశారు. జియో – గూగుల్‌ భాగస్వామ్యంతో స్మార్ట్‌ఫోన్ వెంచర్ క్రియేట్‌ చేయాలన్నది.. ఆయన నెక్ట్స్‌ టార్గెట్‌గా పెట్టుకున్నారు. నిజానికి తన సంతానానికి బాధ్యతలు అప్పగించే విషయంపై.. రిలయన్స్ వార్షిక సమావేశంలోనే.. ముఖేష్‌ సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు ఒక్కో అడుగు వేస్తూ వస్తున్నారు. అనంత్‌ అంబానీకి కూడా త్వరలోనే బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయ్. ఇలా అంబానీ ఫ్యామిీలలో తర్వాతి తరం వారసులుగా ఈషా, ఆకాశ్‌, అనంత్‌.. తమ సంస్థను మరింత బలోపేతం చేస్తారని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)