కోయంబత్తూరు ఎయిర్‌పోర్ట్‌లో 'రోబో' సేవలు

Telugu Lo Computer
0


తమిళనాడులోని కోయంబత్తూరు విమానాశ్రయానికి ప్రతిరోజూ షార్జా, సింగపూరు తదితర విదేశాల నుంచి చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబయి తదితర నగరాల నుంచి విమానాల్లో వేలాదిమంది ప్రయాణికులు వస్తున్నారు. రోజూ 20కి పైగా విమానాలు నడుపుతున్నారు. ఈ విమానాల్లో వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేక సహాయ కేంద్రం నడుపుతున్నారు. ఆ కేంద్రానికి సెల్‌ఫోన్‌ ద్వారా ప్రయాణికులు సంప్రదించి తమకు కావాల్సిన సమాచారాలను తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ విమానాశ్రయంలో ప్రయాణికులకు ప్రత్యేక సేవలందించేందుకు ఇన్‌గేట్‌ సమీపంలో ఒకటి, అవుట్‌గేట్‌ సమీపంలో ఒకటి ఆటోమేటిక్‌ రోబోను ఏర్పాటు చేశారు. ఈ రోబోలు ఎవరి సాయం లేకుండానే కదలుతాయి. విమానం నుంచి దిగి వస్తున్న ప్రయాణికులకు ఈ రోబోలు స్వాగతం పలుకుతాయి. అదే సమయంలో ప్రయాణికులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తాయి. అంతే కాకుండా ప్రయాణికులు విమానం ఎక్కేందుకు వెళ్లే మార్గం గురించి, పాస్‌పోర్ట్‌లో తనిఖీ చేసే కేంద్రం ఉన్న ప్రాంతం గురించి ప్రకటనలు చేస్తుంటాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)