చార్‌ధామ్ పుణ్యక్షేత్రాలను 18,01,209 మంది దర్శించుకున్నారు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 9 June 2022

చార్‌ధామ్ పుణ్యక్షేత్రాలను 18,01,209 మంది దర్శించుకున్నారు !

 

పవిత్ర ఆధ్యాత్మిక శిఖరాలుగా హిమాలయ పర్వతాల్లో వెలిసిన 'చార్‌ధామ్'ను చేరుకోవడం ఆధ్యాత్మిక సాహసంగానే చెప్పవచ్చు. ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా భక్తజనులు భక్తిశ్రద్ధలతో ఈ దైవికధామ్‌లను దర్శించడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ప్రయాణం సాగిస్తారు. చార్ ధామ్ యాత్ర లో భాగంగా మే3 అక్షయ తృతియ రోజున గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాల్లో యాత్రికులకు అనుమతిచ్చారు. కరోనా కారణంగా రెండేళ్లుగా పెద్దగా సందడి లేని ఈ యాత్ర ఈ ఏడాది మాత్రం పూర్తి స్థాయిలో జరుగుతుంది. అందుకు తగ్గట్టే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాట్లతో పాటు అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. అందులో భాగంగా గంగోత్రి, యమునోత్రి, కేదారినాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను దర్శించుకునే భక్తుల సంఖ్యను పరిమితం చేసింది. చార్ ధామ్ యాత్ర ప్రారంభమైన నెల రోజుల్లో అవుతుంది. గర్వాల్ హిమాలయాల్లో చార్ ధామ్ యాత్ర ఈ ఏడాది ప్రారంభమైన కేవలం నెల రోజుల్లోనే రికార్డు స్థాయిలో 18లక్షలకు పైగా యాత్రికులు వచ్చినట్లు ఓ అధికారి తెలిపారు. గురువారం సాయంత్రం 4గంటల సమయానికి బద్రీనాథ్‌కు 6,18,312 మంది, కేదార్‌నాథ్‌కు 5,98,590 మంది యాత్రికులు వచ్చారు. గంగోత్రికి 3,33,9090 మంది, యమునోత్రికి 2,50,398 మంది యాత్రికులు వచ్చినట్లు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ మీడియా ఇన్‌ఛార్జ్ హరీష్ గౌడ్ తెలిపారు. హిమాలయ దేవాలయాలను సందర్శించిన మొత్తం యాత్రికుల సంఖ్య ఇప్పటివరకు 18,01,209కు చేరింది. గత 5-6 రోజులుగా బద్రీనాథ్‌లో ప్రయాణికుల సంఖ్య తక్కువగా కనిపించింది. మంగళవారం నుండి మళ్లీ బద్రీనాథ్‌లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

No comments:

Post a Comment