మంచి పనులకు రాజకీయ రంగు పులుముతున్నారు !

Telugu Lo Computer
0


దిల్లీలో నిర్మించిన 'ప్రగతి మైదాన్‌ సమీకృత రవాణా నడవ'ను ప్రారంభించి ప్రధాని మాట్లాడుతూ ఎన్నో మంచి పనులు, సదుద్దేశంతో చేపట్టిన చర్యలు రాజకీయ రంగు పులుముకోవడం మన దేశ దురదృష్టం' అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇది నయా భారతదేశం అని, సమస్యలను పరిష్కరించుకుంటుందని పేర్కొన్నారు. త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన 'అగ్నిపథ్‌' పథకాన్ని వ్యతిరేకిస్తూ నిన్న దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కేంద్రం తీసుకున్న పలు ప్రధాన నిర్ణయాలు వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. పౌరసత్వ సవరణ చట్టంపై తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. దేశ రాజధాని దిల్లీలో పెద్ద ఎత్తున హింసలు చెలరేగాయి. ఇదికాకుండా, మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ ఏడాదిపాటు రైతులు ఓ ఉద్యమమే చేశారు. పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి వేలాది మంది రైతులు దిల్లీ సరిహద్దులకు చేరుకొని నిరసనలు చేపట్టారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం ఆ మూడు చట్టాలను వెనక్కి తీసుకుంది. త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్రం తాజాగా తీసుకొచ్చిన 'అగ్నిపథ్‌' పథకం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. అనేక రాష్ట్రాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. తమకు అన్యాయం జరుగుతోందంటూ ఆర్మీ అభ్యర్థులు ఆందోళనలకు దిగారు. పలు రాష్ట్రాల్లో రైళ్లను తగులబెట్టారు. అనేకమంది నేతల ఇళ్లకు సైతం ఈ నిరసన సెగ తగిలింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)