విజయవాడ భారీ వర్షం !

Telugu Lo Computer
0


విజయవాడ నగర వాసుల్ని వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వానజల్లులు కురిశాయి.రహదారులపైకి చేరిన వర్షపు నీటితో  డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. గత కొన్ని వారాలుగా ఎండలతో అల్లాడిపోయిన విజయవాడను భారీ వర్షం ముంచెత్తింది. దాదాపు గంటసేపు ఏకధాటిగా వర్షం కురవడంతో నగరం చల్లబడింది. భారీవర్షంతో నగరంలోని ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. బెంజ్ సర్కిల్, రాణిగారితోట, ఎంజీ రోడ్, కృష్ణలంక, ఏలూరు రోడ్, మొగల్రాజపురంలో వాన పడింది. విజయవాడ వన్ టౌన్ ప్రాంతంలోనూ వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. వీధులన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థను మరింత మెరుగుపర్చాలని స్థానికులు కోరుతున్నారు. వాతావరణం చల్లబడటంతో హమ్మయ్యా అంటూ జనం రిలీఫ్ ఫీలవుతున్నారు. మరో రెండు మూడు రోజులు ఇలానే వర్షం కురవాలని జనం కోరుతున్నారు. రుతుపవనాల ప్రభావం రెండు మూడు రోజులు ఇలాగే వుంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)