యువకుడి గోడు విన్న ముఖ్యమంత్రి - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 19 June 2022

యువకుడి గోడు విన్న ముఖ్యమంత్రి


పంజాబ్‌లోని సంగ్రూర్ ఉపఎన్నిక కోసం ముఖ్యమంత్రి ఆదివారంనాడు రోడ్‌షోలో పాల్గొన్న సమయంలో యువకుడితో మాన్ సంభాషిస్తున్న వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ  షేర్ చేసింది. సీఎం రోడ్‌షో జరుపుతుండగా యువకుడు చేతులు ఊపడంతో మాన్ తన కార్ ని ఆపారు. వెంటనే ఆ యువకుడు ఆయనతో మాట్లాడాలంటూ చేయి ముందుకు చాపాడు. సీఎం అతని చేతిని అందుకుంటూ ఓపిగ్గా అతనితో సంభాషించారు. ''అగ్నిపథ్ అమలుకు ముందే నేతలంతా సమవేశమై దానిపై చర్చించాలి'' అని ఆ యువకుడు సీఎంకు విన్నవించాడు. దీనికి ముఖ్యమంత్రి సమాధానమిస్తూ, ఎంపీలు అగ్నిపథ్‌పై చర్చించేందుకు సమావేశమైతే తాను వ్యక్తిగతంగా అక్కడకు వెళ్తానని ఆ యువకుడికి భరోసా ఇచ్చారు. "భగవంత్ మాన్‌ను పంజాబ్ ఎందుకు ప్రేమిస్తుందనడానికి కారణం ఇదే'' అంటూ ఆప్ అఫీషియర్ ట్విట్టర్ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ధురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భగవంత్ మాన్ ఇటీవల పోటీ చేసి గెలుపొందారు. అనంతరం పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఎంపీ పదవికి వెంటనే రాజీనామా చేశారు. దీంతో సంగ్రూర్ ఉప ఎన్నిక అనివార్యమైంది.

No comments:

Post a Comment