హ్యాట్సాఫ్ కండక్టరన్నా...!

Telugu Lo Computer
0


హర్యానాకి చెందిన సురేందర్ శర్మ రోడ్‌వేస్‌లో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఎండలో ఇబ్బంది పడిన ప్రయాణికులకు నీళ్లు ఇస్తున్నాడు... దీనికోసం బస్సులో ఏకంగా ఓ వాటర్ క్యాన్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు. అందరూ నీళ్లు తాగాక ఎక్కడికి వెళ్లాలో మర్యాదగా కనుక్కోని వారికి టికెట్ కొడుతున్నాడు.. సురేందర్ శర్మ గత 12 ఏళ్లుగా కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అతను ఇలా బస్సులో వాటర్ సర్వీస్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఇతనికి సంబంధించిన న్యూస్ వైరల్ కావడంతో నెటిజన్లు అతనిని అభినందించకుండా ఉండలేకపోతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)