వర్సిటీలకు ఛాన్సలర్‌గా మమతా బెనర్జీ

Telugu Lo Computer
0


బెంగాల్ రాష్ట్ర పరిధిలో నడుస్తున్న విశ్వవిద్యాలయాలకు సీఎం మమతా బెనర్జీనే ఛాన్సలర్‌గా నియమిస్తూ చేసిన ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సాధారణంగా రాష్ట్ర గవర్నర్ మాత్రమే వర్సిటీలకు ఛాన్సలర్‌గా ఉంటారు. అయితే ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంకార్ స్థానంలో ఇక నుంచి మమతా బెనర్జీయే ఛాన్సలర్‌గా ఉండనున్నారు. ప్రైవేటు వర్సిటీల్లో విజిటర్ హోదాలో ఉండే గవర్నర్‌ను కూడా తొలగిస్తూ ఆ అవకాశాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ, ఆరోగ్య వర్సిటీలకు కూడా మమతానే ఛాన్సలర్‌గా ఉంటారని క్యాబినెట్ తీర్మానించింది. అయితే జూన్ 10వ తేదీ నుంచి జరగనున్న వర్షాకాల సమావేశాల్లో తాజా ప్రతిపాదనను బిల్లుగా ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)