గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కేంద్రం ఓకే !

Telugu Lo Computer
0


గుజరాత్‌లోని ధొలేరాలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇందులో భాగంగా రూ.1,305 కోట్ల అంచనా వ్యయంతో 48 నెలల్లో ఫేజ్-1 నిర్మాణం పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ సంయుక్తంగా 51:33:16 నిష్పత్తి వాటాతో ధొలేరా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కంపెనీ లిమిటెడ్ ద్వారా ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు కొనసాగిస్తుంది. ధొలేరా స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ నుంచి కార్గో ఎగుమతులే లక్ష్యంగా విమానాశ్రయ నిర్మాణం జరుగుతుంది. ఆ ప్రాంతంలో మేజర్ కార్గో హబ్‌గా ఈ కొత్త విమానాశ్రయం మారనుంది. అహ్మదాబాద్‌కు 80 కి.మీ దూరంలో ధొలేరా విమానాశ్రయ నిర్మాణం జరగనుంది. 2025-26 నుంచి ప్రయాణికులు దీని ద్వారా రాకపోకలు ప్రారంభించవచ్చు. ఏడాదికి 3 లక్షల ప్రయాణికుల రాకపోకల లక్ష్యంతో ప్రారంభమవుతుంది. 20 ఏళ్ళలో ఏడాదికి 23 లక్షల ప్రయాణికుల రాకపోకలు జరుగుతాయని అంచనా. 2025-26 నుంచి 20,000 టన్నుల కార్గోతో మొదలై, 20 ఏళ్ళలో 2,73,000 టన్నులకు చేరుకునేలా అంచనాలు వేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)