కరోనా వైరస్ ను కట్టడి చేసే కృత్రిమ ప్రోటీన్ లు !

Telugu Lo Computer
0


బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ) పరిశోధకులు కరోనా వైరస్ ను కట్టడి చేసే కృత్రిమ ప్రోటీన్ లను తయారు చేశారు. కరోనా వైరస్ కు కారణమయ్యే సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ను క్రియారహితంగా మార్చే కృత్రిమ పప్టైడ్‌లను తయారు చేశారు. వీటిని ఎస్‌ఐహెచ్‌ మినీ ప్రొటీన్‌లుగా పేర్కొన్నారు. కరోనా వైరస్‌ మానవ కణజాలాల్లోకి ప్రవేశించకుండా ఇవి అడ్డుకొంటాయని పేర్కొన్నారు. వైరస్‌ కణాలను అడ్డుకోవడంతో పాటు వాటినన్నింటిని ఒక్క చోట చేర్చి శరీరంలో ఇతర అవయవాలకు సోకకుండా నిరోధిస్తాయని వెల్లడించారు. కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గతకొన్నిరోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా రోజువారీ కేసుల సంఖ్య మూడు నెలల గరిష్ఠానికి చేరింది. కరోనా కేసుల సంఖ్య పెరగడానికి కొత్త వేరియంట్‌ కారణమనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ను భారీ స్థాయిలో నిర్వహించక తప్పదని వైద్య నిపుణులు చెబుతున్నారు. లేదంటే వైరస్‌ వ్యాప్తికి గల కారణాలను తెలుసుకోవడం కష్టమేనని అంటున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)