గర్భంలో తెగిన శిశువు తల !

Telugu Lo Computer
0


పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో భీల్ హిందూ వర్గానికి చెందిన 32 ఏళ్ల నిండు గర్భిణీ ప్రసవవేదనతో సమీపంలోని ఆర్‌హెచ్‌సీ (రూరల్ హెల్త్ సెంటర్)కి వెళ్లింది. కానీ అక్కడ గైనకాలజిస్ట్ అందుబాటులో లేరు. దీంతో అనుభవంలేని సిబ్బంది ఆపరేషన్ నిర్వహిస్తూ గర్భంలోని శిశువు తలను కట్ చేశారు. దీంతో తల గర్భంలోనే మిగిలిపోయింది. ఈ ఘటన బాధిత మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. దీంతో హుటాహుటిన ఆమెను సమీపంలోని మరో హాస్పిటల్‌ కి తరలించారు. అక్కడ కూడా సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో ఎల్‌యూఎంహెచ్‌ఎస్‌కు తరలించారు. అక్కడి ఆపరేషన్ నిర్వహించి శిశువు తలను బయటకు తీశారు. దీంతో బాధిత మహిళకు ప్రాణపాయం తప్పింది. శిశువు తల భాగం గర్భంలో చిక్కుకుంది. దీంతో పొత్తి కడుపు ఆపరేషన్ నిర్వహించి తలను తొలగించామని లిఖ్వాయత్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్ (ఎల్‌యూఎంహెచ్ఎస్)లో గైనకాలజీ విభాగం హెడ్, ప్రొఫెసర్ రహీల్ సికందర్ వెల్లడించారు. ఈ ఘటనపై సింధ్ ప్రావిన్స్ ప్రభుత్వం మెడికల్ దర్యాప్తునకు ఆదేశించింది. అసలేం జరిగింది, నిందితులు ఎవరనేది తేల్చాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)