మోదీతో మైసూరు రాజవంశస్తులు అల్పాహారం !

Telugu Lo Computer
0


కర్ణాటకలోని రాచనగరి మైసూరులో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గోన్నారు. యోగాతో ఏకాగ్రత, క్రమశిక్షణ అలవడుతుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రతిరోజు మనం కొన్ని నిమిషాలపాటు చేసే ధ్యానం మనల్ని ఉత్తేజితుల్ని చేస్తోంది. యోగా శాంతికి, ఆరోగ్యం, సంతోషానికి సూచిక అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. యోగాను గుర్తించిన ఐక్యరాజసమితి సహా ప్రపంచ దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు యోగాసనాలు వేసిన విద్యార్థులు, స్థానిక ప్రజలు చాలా ఉత్సాహంగా కనిపించారు. మోదీ కోసం మైసూరులో పూర్తి శాఖాహారం వంటకాలు సిద్దం చేశారు. ఉదయం అవలక్కి (అటుకులు), ఉప్మా, ఇడ్లీ-సాంబార్, బ్రెడ్ బటర్, మిక్స్ ఫ్రూట్స్ సిద్దం చేశారు. మద్యాహ్నం మైసూరు శైలీలో విజిటబుల్ సూప్, మసాలా మజ్జిగ, రోటి, జీరా రైస్, దాల్, మిక్స్ ఫ్రూట్స్ సిద్దం చేశారు. మోదీకి తయారు చేయించిన వంటకాలలో చక్కర, మసాలాలు తక్కువగా వాడుతున్నారని సమాచారం. రాత్రి ఓ మెనూ కూడా సిద్దం చేశారు. కిచడి, గుజరాతి శైలిలో కర్రీ, రోటి, దాల్, రైస్, రెండు రకాల సబ్జి, మసాలా మజ్జిగ, మిక్స్ ఫ్రూట్ సిద్దం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మోను సిద్దం చేసిన అధికారులు వాటిని ఆయనకు వడ్డించడానికి సిద్దం అయ్యారు. మైసూరు రాజవంశస్తులతో ప్రధాని నరేంద్ర మోదీ బ్రేక్ ఫాస్ట్ చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)