సాయి డిఫెన్స్ అకాడమీలో ఐటీ,ఐబీ సోదాలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా నర్సరావుపేట సాయి డిఫెన్స్ అకాడమీలో ఐటీ, ఐబీ సోదాలు ముగిసాయి. అకాడమీ లోని కంప్యూటర్ లలో సమాచారాన్ని హార్డ్ డిస్క్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అదుపులోనే ఆవుల సుబ్బారావు వున్నట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ విధ్వంసం కేసులో నరసరావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమీని నిర్వహిస్తున్న సుబ్బారావు పాత్ర ఉన్నట్టు తేలడంతో ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు వందలమంది విద్యార్థులను పంపినట్టు గుర్తించారు. ఈ మొత్తం ఘటన వెనక ఉన్నది సుబ్బారావేనంటున్నారు పోలీసులు.అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసం వెనక ఆవుల సుబ్బారావు అనే డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. సాయి డిఫెన్స్ అకాడమీ పేరుతో నరసరావుపేటలో శిక్షణ నిస్తున్న సుబ్బారావు ప్రస్తుతం అక్కడి పోలీసుల అదుపులో ఉన్నారు. ఆందోళన కోసం వందలాది మంది విద్యార్థులను గుంటూరు నుంచి సికింద్రాబాద్ కు పంపినట్టు పోలీసులు గుర్తించారు. అలా వచ్చిన విద్యార్థులు శుక్రవారం రైల్వే స్టేషన్‌లో ఆందోళనకు దిగారు. ఆ తర్వాత అది కాస్తా హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు పలు రైళ్లకు చెందిన బోగీలకు నిప్పు పెట్టడంతోపాటు రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. 12 కోట్లకు పైగా ఆస్తినష్టం సంభవించింది. ఈ మొత్తం ఘటన వెనక ఉన్నది సుబ్బారావేనని, ఆందోళనకారులను అతడే ప్రేరేపించాడని పోలీసులు గుర్తించారు. అకాడమీలో నిర్వహించిన సోదాల్లో కీలక సమాచారం లభించినట్టు తెలుస్తోంది. ఈరోజుకూడా సోదాలు కొనసాగే అవకాశం వుందంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)