కాళేశ్వరంలో చేపల వర్షం

Telugu Lo Computer
0


తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని జిల్లాల్లో మంగళవారం తెల్లవారుజాము దాకా ఎడతెరిపి లేని వర్షం కురిసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో చేపల వర్షం కురిసింది. వర్షపు చినుకులతో పాటు నేలపై అక్కడక్కడా కొన్ని చేపలు పడ్డాయి. దీంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఇలాంటి చేపలను ఇంతకుముందెప్పుడూ చూడలేదని అన్నారు. ఈ చేపలు ఎక్కడి నుంచి వచ్చాయో, ఎలా వచ్చి పడ్డాయో తెలియట్లేదన్నారు. ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్లే కొంతమంది ఈ చేపలను గుర్తించారు. చేపల వర్షంపై స్థానిక అధికారులు స్పందిస్తూ వర్షాకాలంలో ఇలా జరగడం సహజమేనన్నారు. నదులు, చెరువులు, సముద్రాల్లో సుడిగుండాలు ఏర్పడినప్పుడు...అందులోని చేపలు గాల్లోకి ఎగిరి మేఘాల్లో చిక్కుకుంటాయని చెప్పారు. మేఘాలు ఎక్కడైతే వర్షిస్తాయో.. అక్కడ అవి నేలపై పడిపోతాయని అన్నారు. అంతే తప్ప ఇందులో పెద్ద వింతేమీ లేదని స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)