జబర్దస్త్ లో సినిమా ప్రమోషన్‌ కు ఖర్చు ఎంత ?

Telugu Lo Computer
0


జబర్దస్త్‌ లోనే కాకుండా ఏ షో లో అయినా ఒక సినిమాను ప్రమోట్‌ చేసుకోవాలంటే ఆ షో నిర్వాహకులకు లేదా ఛానల్‌ వారికి సదరు నిర్మాత భారీ మొత్తంలో డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. ఆ డబ్బు అనేది ఆ షో రేటింగ్ మరియు జనాల్లో ఆ సినిమాకు ఉన్న పాపులారిటీని బట్టి ఉంటుంది. షో కు టాప్ రేటింగ్‌ ఉంటే.. సినిమా నిర్మాతలు ఆ షో లో ప్రమోషన్ కు ఇచ్చే అమౌంట్ కూడా అంతే ఉంటుంది. ఉదాహరణకు తెలుగు బుల్లి తెర టాప్ షో లు అయిన జబర్దస్త్‌.. క్యాష్‌ ఇంకా కొన్ని షో ల్లో సినిమా ప్రమోట్ చేయాలంటే లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మల్లెమాల మరియు ఈటీవీ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం జబర్దస్త్‌ షో లో ఒక సినిమా ను ప్రమోట్‌ చేసుకోవాలంటే 12 లక్షల నుండి 15 లక్షల వరకు సదరు నిర్మాత ఈటీవీ మరియు మల్లెమాల వారికి చెల్లించాల్సి ఉంటుందట!. ఈ మొత్తం గతంలో పాతిక లక్షల వరకు ఉండేదట. ఈమద్య కాలంలో జబర్దస్త్‌ రేటింగ్‌ తగ్గడం వల్ల ఈ అమౌంట్ కూడా తగ్గిందని అంటున్నారు. క్యాష్ లో సినిమా ప్రమోషన్‌ కు కూడా దాదాపుగా పది లక్షల రూపాయలకు పైగానే నిర్మాతలు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. మొత్తానికి బ్రాండ్స్ ప్రమోషన్‌ ద్వారా మాత్రమే కాకుండా సినిమాల ప్రమోషన్ ద్వారా కూడా జబర్దస్ద్‌ వారు భారీగా సంపాదిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)