రాష్ట్రపతి రేసులో లేను - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 13 June 2022

రాష్ట్రపతి రేసులో లేను


రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల అభ్యర్థిగా బరిలోకి దింపాలనే ప్రతిపాదనను శరద్ పవార్ తిరస్కరించారని విశ్వసనీయ ఎన్సీపీ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ''నేను రాష్ట్రపతి పదవి కోసం రేసులో లేను, రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల అభ్యర్థిని కాను'' అని శరద్ పవార్ స్పష్టంగా చెప్పారు. 81 ఏళ్ల కేంద్ర మాజీ మంత్రి అయిన శరద్ పవార్ అధికారికంగా తన తిరస్కరణను కాంగ్రెస్ పార్టీకి తెలియజేయలేదు.రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు అవసరమైన మెజారిటీని సాధించగలవనే నమ్మకం శరద్ పవార్‌కు లేదని ఎన్సీపీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓడిపోయే పోరులో పోటీ చేయడానికి శరద్ పవార్ మొగ్గు చూపడం లేదని ఆయన పార్టీ వర్గీయులు అంటున్నారు. మహారాష్ట్రలో ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లోనూ ప్రతిపక్షాలు దెబ్బతిన్నాయి. శివసేనకు చెందిన సంజయ్ పవార్ ను ఓడించి బీజేపీ రాజ్యసభ సీటు సాధించింది.శివసేన అభ్యర్థికి మద్ధతు ఇస్తామని వాగ్ధానం చేసిన పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థిని ఎన్నుకున్నారు. మహారాష్ట్రలోని ఎన్సీపీ మిత్రపక్షాలైన కాంగ్రెస్, శివసేన పార్టీలు రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల ఏకాభిప్రాయ అభ్యర్థిగా శరద్ పవార్ కావాలని కోరుకుంటున్నాయి. దీనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే సోనియాగాంధీ సందేశంతో ఇటీవల ముంబైలో పవార్ ను కలిసి మాట్లాడారు. ఆమ్ ఆద్మీపార్టీ నేత సంజయ్ సింగ్ కూడా తాజాగా ఎన్సీపీ నేతకు ఫోన్ చేశారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయమై మల్లికార్జున్ ఖర్గే శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌లతో కూడా మాట్లాడారు.రాష్ట్రపతి ఎన్నికల ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు బుధవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ప్రతిపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా కాంగ్రెస్ సంప్రదించింది.దేశంలోని అత్యంత సీనియర్ రాజకీయ నాయకులలో ఒకరైన పవార్, గత కొన్ని దశాబ్దాలుగా అనేక సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో,విచ్ఛిన్నం చేయడంలో కీలకపాత్ర పోషించారు.

No comments:

Post a Comment