పచ్చి పసుపు - ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


పసుపులో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది అనేక వ్యాధులని నయం చేస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే పచ్చి పసుపులో కాల్షియం, ఐరన్‌తో సహా అనేక విటమిన్లు ఉంటాయి. ఇది రుచిలో చేదుగా ఉంటుంది. కానీ తింటే చాలా మంచిది. పచ్చి పసుపు షుగర్ పేషెంట్లకు ఒక వరం లాంటిది. పసుపును సరైన మోతాదులో తీసుకుంటే షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. నిజానికి పసుపులో ఉండే లిపోపాలిసాకరైడ్ అనే మూలకం రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గిస్తుంది. పచ్చి పసుపును అప్లై చేయడం వల్ల ముఖంలో మెరుపు వస్తుంది. పచ్చి పసుపును రోజూ అప్లై చేయడం వల్ల చర్మంపై ఉన్న మచ్చలు కొద్ది రోజుల్లోనే తొలగిపోయి చర్మం మెరుస్తుంది. దీని కోసం ఒక చెంచా పచ్చి పసుపులో పాలు కలిపి పేస్ట్ లా చేసి రోజూ ముఖానికి అప్లై చేసి, అరగంట తర్వాత కడిగేయాలి. మీరు దీని నుంచి ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు. పసుపులో కరిక్యుమిన్ అనే పదార్థం ఉంటుంది. అందు వల్లనే ఆయుర్వేద శాస్త్రంలో దీనిని వ్యాధులను నిర్మూలించడానికి కొన్ని రకాల మందులలో వాడుతూ ఉంటారు. ముఖ్యంగా పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. దాని వల్ల రోగ నిరోధక శక్తి శరీరం లో పెరిగి తిరిగి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం శరీరంలో వాత, పిత్త మరియు కఫ గుణాలను సమతుల్యంగా ఉంచడానికి పసుపు చాలా కీలక పాత్ర పోషిస్తుందని చెబుతారు.

Post a Comment

0Comments

Post a Comment (0)