రూమర్స్‌తో విసిగిపోయా : రామ్‌ పోతినేని - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 30 June 2022

రూమర్స్‌తో విసిగిపోయా : రామ్‌ పోతినేని


సోషల్‌ మీడియాలో తన పెళ్లిపై వస్తోన్న రూమర్స్‌పై నటుడు రామ్‌ పోతినేని  స్పందించారు. వాటి వల్ల తాను ఎంతగానో విసిగిపోయానని, అసత్య ప్రచారాల వల్ల అయిన వాళ్లకే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్‌ పెట్టారు. ''ఓరి దేవుడా..!! ఇకనైనా ఆపండి.. పరిస్థితి ఎంతలా దిగజారిందంటే చివరికి హైస్కూల్‌ స్వీట్‌హార్ట్‌ అంటూ నాకు ఎవరూ లేరని, నేను ఎవర్నీ పెళ్లి చేసుకోవడం లేదని ఇంట్లోవాళ్లు, ప్రాణమిత్రులను సైతం నమ్మించాల్సి వస్తోంది. మరో విషయం ఏమిటంటే.. ఆ రోజుల్లో నేనస్సలు స్కూల్‌కే సరిగ్గా వెళ్లలేదు'' అని రామ్‌ రాసుకొచ్చారు. రామ్‌ త్వరలో పెళ్లి చేసుకోనున్నారని ఇటీవల నెట్టింట జోరుగా ప్రచారం సాగింది. తన హైస్కూల్‌ ఫ్రెండ్‌తో ఎంతోకాలంగా సీక్రెట్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, ఎట్టకేలకు ఈ ఏడాది ఏడడుగులు వేయాలనుకుంటున్నారని పలు వెబ్‌సైట్లలో కథనాలు వచ్చాయి. దీంతో ఆ వార్తలపై రామ్‌ తాజాగా ట్విటర్‌లో స్పందించడంతో ఆయన పెళ్లి వార్తలకు చెక్‌ పడినట్లు అయ్యింది. సినిమాల విషయానికొస్తే.. రామ్‌ ప్రస్తుతం 'ది వారియర్‌' (The Warriorr) పోస్ట్‌ ప్రొడెక్షన్‌ పనులతో బిజీగా ఉన్నారు. లింగుస్వామి (Lingusamy) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయన సత్య అనే పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు. కృతిశెట్టి కథానాయిక. మరోవైపు, రామ్‌ ఇటీవల యాక్షన్‌, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీనుతో (Boyapati Srinu) కొత్త ప్రాజెక్ట్‌ ఓకే చేసిన సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment