కరెంటు వైరు ఆటోపై పడి 8 మంది సజీవదహనం ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 30 June 2022

కరెంటు వైరు ఆటోపై పడి 8 మంది సజీవదహనం !


ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లాలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తాడిమర్రి మండలంలో పెను విషాద ఘటన జరిగింది. చిల్లకొండయ్యపల్లిలో గురువారం ఉదయం వ్యవసాయ పనుల కోసం 8 మంది ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటోపై హైటెన్షన్‌ కరెంట్‌ తీగలు తెగిపడ్డాయి దీంతో ఒక‍్కసారిగా మంటలు చెలరేగాయి. కిందికి దూకే వీలు కూడా లేకుండా క్షణాల్లో కరెంటు, మంటలు ఆటోలో వెళ్తున్న ఎనిమిది మంది ప్రాణాలను తీసేసేశాయి. లోపలున్న అందరూ సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని గుడ్డంపల్లి వాసులుగా గుర్తించారు. స్థానికులు ప్రమాద స్థలికి చేరే సమయానికి ఆటోతోపాటు తగలబడుతోన్న మృతదేహాలే తప్ప ఏ ఒక్కరినీ కాపాడే పరిస్థితి కనిపించలేదు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఇంతటి ఘోరం ఎలా జరిగిందో, మృతుల వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

No comments:

Post a Comment