మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌, సర్కారుకు సుప్రీంకోర్టు నోటీసులు

Telugu Lo Computer
0


మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ ఇచ్చిన అనర్హత నోటీసులపై నిన్న రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే, ఎమ్మెల్యే భరత్ గోగావాలే సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో షిండే వర్గానికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. అనర్హత నోటీసులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణ వరకు అనర్హత నోటీసులపై చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు తెలిపింది. డిప్యూటీ స్పీకర్, మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది. ఐదు రోజుల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి మూడు రోజుల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని చెప్పింది. తదుపరి విచారణను జూలై 11కి వాయిదా వేసింది. కాగా, ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండే, చిమన్‌రావ్ పాటిల్, బాలాజీ కల్యాణ్‌కర్, సంజయ్, రమేశ్‌ బోర్నారే, మహేశ్ షిండే, అబ్దుల్ సత్తార్, సందీపన్‌రావ్ బుమ్రే, భరత్‌షేత్ గోగావాలే, సంజయ్ షిర్సత్, యామినీ జాదవ్, లతా సోనావానే, అనిల్, తానాజీ సావంత్ బాలాజీ సావంత్‌లకు జూన్ 25న అనర్హత నోటీసులు అందిన విషయం తెలిసిందే. రెబల్ ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)