హిందీ భాష అభివృద్ధి చెందని రాష్ట్రాలది

Telugu Lo Computer
0


హిందీ భాష అభివృద్ధి చెందని రాష్ట్రాలకు సంబంధించినదంటూ డీఎంకే ఎంపీ ఇలంగోవన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ”బిహార్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్ వంటి అభివృద్ధి చెందని రాష్ట్రాల్లో మాత్రమే హిందీ మాతృ భాషగా ఉంది. పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, పంజాబ్ రాష్ట్రాలను పరిశీలించండి. ఈ రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి కదా? ఈ రాష్ట్రాల ప్రజలకు హిందీ మాతృ భాష కాదు” అని టీకేఎస్ ఎలంగోవన్ అన్నారు. అంతేకాదు, హిందీ భాష మనల్ని శూద్రులుగా మార్చుతుందంటూ టీకేఎస్ ఎలంగోవన్ వ్యాఖ్యానించారు. హిందీ భాష మనకు మంచిది కాదు అని ఆయన చెప్పారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇంగ్లిష్‌కు ప్రత్యామ్నాయం హిందీ అని, అంతేగానీ, స్థానిక భాషలు కాదని అన్నారు. దేశ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోందని దక్షిణాది నేతలు చాలా కాలంగా మండిపడుతున్నారు. అటువంటి తీరును తాము అంగీకరించబోమని చెబుతున్నారు. ముఖ్యంగా తమిళనాడు నుంచి హిందీ భాషపై వ్యతిరేకత అధికంగా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)