కానిస్టేబుల్ విచక్షణారహితంగా జరిపిన కాల్పులకు యువతి బలి

Telugu Lo Computer
0


కోల్ కతాలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయానికి సమీపంలోని పార్క్ సర్కస్ వద్ద ఆర్మ్ డ్ పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న చోదప్ లేప్చా విచ్చలవిడిగా జరిపిన కాల్పుల్లో ఆ దారిగుండా ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ మహిళ వెన్నులోకి ఓ తూటా దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తుపాకీతో విచక్షణరహితంగా 10 నుంచి 15 రౌండ్లు కాల్పులు జరిపాడు. వీటిలో ఓ బుల్లెట్ దారినపోతున్న మహిళ వెన్నెముకను ఛిద్రం చేస్తూ దూసుకెళ్లింది. ఆ మహిళ బుల్లెట్ గాయంతో ప్రాణం విడిచింది. అనంతరం గడ్డం కింద తుపాకీ పెట్టుకుని ఆ కానిస్టేబుల్ తనను తాను కాల్చుకున్నాడని ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. చోదప్ లేప్చా ఇటీవల సెలవుపై వెళ్లి శుక్రవారం తిరిగి డ్యూటీలో చేరాడు. తుపాకీ చేతబట్టి ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకొచ్చిన అతను పెద్దగా కేకలు వేస్తూ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గాయపడిన ఓ వ్యక్తికి ఇక్కడి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కానిస్టేబుల్ చోదప్ లేప్చా తుపాకీతో రోడ్డు మీదికి వచ్చాడు. అతడిని చూసిన స్థానికులు బొమ్మ తుపాకీతో తమాషా చేస్తున్నాడని భావించారు. కానీ అంతలోనే హఠాత్తుగా కాల్పులు జరిపేసరికి షాక్ అయ్యారు.ఈ షాక్ నుంచి తేరుకునేసరికే కానిస్టేబుల్ 10 నుంచి 15 రౌండ్లు కాల్పలు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్ దూసుకెళ్లి మహిళ ప్రాణాలు కోల్పోగా, ఇంకో బుల్లెట్ ఓ కారుని తాకింది. ఓ వ్యక్తి త్రుటిలో తప్పించుకున్నాడు. నిజమైన కాల్పులే అని అర్థంఅయిన వెంటనే స్థానికులు అప్రమత్తమయ్యేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కానిస్టేబుల్ కాల్పుల ధాటికి జనాలు హడలిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానిస్టేబుల్ చోదప్ లేప్చా ఫస్ట్ బెటాలియన్ కు చెందిన ఆర్మ్ డ్ కానిస్టేబుల్ అని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నామని పోలీసు కమిషనర్ వినీత్ గోయల్ తెలిపారు. శుక్రవారం తిరిగి డ్యూటీలో చేరిన సమయంలో లెప్చా వద్ద 40 రౌండ్ల బుల్లెట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కానిస్టేబుల్ కాల్పుల్లో మృతి చెందిన యువతిని హౌరాలో నివసించే రీమా సింగ్ గా గుర్తించారు పోలీసులు. రీమాకు త్వరలోనే వివాహం జరుగనుంది అని ఆమె తల్లి కూతురు మృతదేహాన్ని వద్ద శోకిస్తే వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)