రూ. 540 పెరిగిన బంగారం ధర

Telugu Lo Computer
0


ఈ వారం ప్రారంభంలో తగ్గుతున్నట్లు కనిపించిన బంగారం ధర ఈరోజు అమాంతం పెరిగింది. గత నెల చివరి వరకూ పెరుగుతూ వచ్చినా చివరి రోజు తరుగుదల నమోదు చెయ్యడంతో పాటుగా జూన్ 1 వ తేదీ కూడా ధర తగ్గింది. త రెండు రోజులుగా బంగారం ధర తిరిగి పుంజుకుంది. ఈ రోజు బంగారం ధర దాదాపుగా 540 పైగా పెరుగుదలను చూసింది. అయితే, నిన్నటి నుండి బంగారం ధర తరుగుధలను నమోదు చేస్తోంది. ఈ రెండు రోజుల్లోనే బంగారం(10గ్రా) దాదాపుగా 540 రూపాయల పెరుగుదలను నమోదు చేసింది. ఇక ఈరోజు బంగారం ధర పరిశీలిస్తే, 51,930 వద్ద ప్రారంభమైన 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 540 రూపాయలు పెరిగి నమోదు చేసి, 52,470 వద్ద కొనసాగుతోంది. గుడ్రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,600 రూపాయలుగా ఉండగా, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,100 రూపాయలుగా ఉంది. అలాగే, నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,930 కాగా, నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,470 వద్ద కొనసాగుతోంది. అంటే, ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర 540 రూపాయలు పెరిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)