ఆసియా కుబేరుడిగా ముఖేశ్ అంబానీ

Telugu Lo Computer
0

 


రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ ఆసియా కుబేరుడిగా మరోసారి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఆయన ప్రత్యర్థి, అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ కన్నా అధిక సంపదతో అగ్ర శ్రేణిలో నిలిచారు. వీరిద్దరి సంపద మధ్య తేడా 1 బిలియన్ డాలర్లు మాత్రమే. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం జూన్ 3నాటికి ముఖేశ్ అంబానీ సంపద విలువ 99.7 బిలియన్ డాలర్లు, కాగా అదానీ సంపద విలువ 98.7 బిలియన్ డాలర్లు. అంటే అంబానీ సంపద అదానీ సంపద కన్నా 1 బిలియన్ డాలర్లు అధికం. బిలియనీర్ల నికర సంపద విలువను పరిశీలించే బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ గడచిన 24 గంటల్లో ఆస్తుల విలువలను పరిశీలించింది. అంబానీ ఆస్తి విలువ 24 గంటల్లో 3.59 బిలియన్ డాలర్లు పెరగగా, అదానీ సంపద విలువ 2.96 బిలియన్ డాలర్లు పెరిగిందని వెల్లడైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ల విలువ పెరగడం కొనసాగడంతో అంబానీ సంపద పెరిగింది. శుక్రవారం సెషన్లో రిలయన్స్ షేర్లు రికార్డు స్థాయిలో ట్రేడ్ అయ్యాయి. బీఎస్ఈ శుక్రవారం ట్రేడ్ లో రిలయన్స్ షేర్లు 3 శాతం పెరిగి, రూ.2,816.35కు చేరాయి. గడచిన రెండు ట్రేడింగ్ డేస్ లో 7 శాతం ర్యాలీ అయ్యాయి. ఈ సమయంలో ఈ కంపెనీ టోటల్ మార్కెట్ కేపిటలైజేషన్ రూ.19.05 ట్రిలియన్ కు అదనంగా రూ.1.25 ట్రిలియన్ చేరింది. ప్రపంచ సంపన్నుల జాబితాలో ముఖేశ్ అంబానీ ఎనిమిదో స్థానంలో ఉన్నారు. గౌతమ్ అదానీ తొమ్మిదో స్థానంలో ఉన్నారు. ఆయిల్ రిఫైనింగ్ మార్జిన్స్, టెలికాం, డిజిటల్ సర్వీసెస్, రిటెయిల్ బిజినెస్ లలో అత్యధిక లాభాలు రావడంతో అంబానీ సంపద విలువ పెరిగింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాలో అంబానీ నెట్ వర్త్ 104.7 బిలియన్ డాలర్లకు, అదానీ నెట్ వర్త్ 100.1 బిలియన్ డాలర్లకు పెరిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)